30 రోజుల కస్టడీ బిల్లు.. ప్రతిపక్షాలపై కుట్ర: CPM

30 రోజుల కస్టడీ బిల్లు.. ప్రతిపక్షాలపై కుట్ర: CPM

KMM: ప్రజలందరికీ దేశానికి ఉపయోగపడే చట్టాలు చేయాల్సిన పార్లమెంట్, చట్టపరమైన విధానాలను తప్పించుకునే దిశగా బిల్లులు తీసుకొస్తోందని CPI(M) కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం అన్నారు. గురువారం ఖమ్మంలో జరిగిన కామ్రేడ్ కోటయ్య సంస్కరణ సభలో తమ్మినేని పాల్గొని మాట్లాడారు. ప్రతిపక్షాలను అణచివేసే చర్యల్లో భాగమే 30 రోజుల కస్టడీ బిల్లు అని పేర్కొన్నారు.