'ఉద్యమ స్ఫూర్తి ప్రతిబింబించేలా దీక్షా దివాస్ నిర్వహించాలి'
VKB: ఉద్యమ స్ఫూర్తి ప్రతిబింబించేలా దీక్షా దివాస్ కార్యక్రమం నిర్వహించాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఆనంద్ పేర్కొన్నారు. బుధవారం వికారాబాద్‌లోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నేతలు, కార్యకర్తలతో దీక్షా దివాస్‌పై సమావేశం నిర్వహించారు. కేసీఆర్ దీక్ష చేపట్టిన సందర్భాన్ని పురస్కరించుకుని ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు.