'నష్టపోయిన ప్రతి రైతును ఆదుకుంటాం'

'నష్టపోయిన ప్రతి రైతును ఆదుకుంటాం'

KDP: సిద్దవటం మండలంలో గురువారం రాత్రి వీచిన పెనుగాలుల వర్షానికి భాకరాపేట, బొగ్గిడివారి పల్లె, పెద్దపల్లె గ్రామాల్లోని అరటి, బొప్పాయి తోటలు నేలకూలాయి. శుక్రవారం ఉద్యానాధికారి జయ భరత్ రెడ్డి దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. దెబ్బతిన్న పంటలను అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిక పంపిస్తామన్నారు. నష్టపోయిన ప్రతి రైతుకు నష్టపరిహారం అందిస్తామన్నారు.