బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మాజీ MLA
BHPL: మున్సిపాలిటీలోని 21వ వార్డుకు చెందిన గోగు తిరుపతి ఇటీవల అనారోగ్యానికి గురై మరణించారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ MLA గండ్ర వెంకటరమణారెడ్డి శనివారం మృతుడి నివాసానికి వెళ్లి ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం బాధిత కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో BRS నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.