బెల్లంకొండవారిపాలెంలో ఫీల్డ్ వెరిఫికేషన్
ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం కొత్త బెల్లంకొండవారిపాలెం గ్రామంలో ఆదివారం ఎంపీడీవో ఆర్.వి.యస్. ప్రసాదరావు ఫీల్డ్ వెరిఫికేషన్ నిర్వహించారు. హౌస్ ట్యాక్స్ డోర్ టు డోర్ వసూలు, యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే పనులను పరిశీలించారు. రోజువారీ లక్ష్యాలను నిర్లక్ష్యం లేకుండా సమయపాలనతో పూర్తి చేయాలని సిబ్బందికి సూచించారు.