వర్షభావ పరిస్థితులపై సమీక్ష

SKLM: బంగాళాఖాతంలో వాయుగుండం దృష్ట్యా సంతబొమ్మాళి మండలం సైక్లోన్ ఇంఛార్జి అధికారి, జిల్లా జడ్పీ సీఈవో శ్రీధర్ రాజా సోమవారం సాయంత్రం ఎంపీడీవో కార్యాలయానికి చేరుకున్నారు. ఈ మేరకు ఇక్కడి పరిస్థితులపై సమీక్ష చేశారు. మండలంలో ఉన్న పంచాయతీలతో పాటు, సముద్ర తీరప్రాంత గ్రామాల్లో ఉన్న పంచాయితీల వివరాలను అడిగి తెలుసుకున్నారు.