‘దోమలపై ఆయిల్ బాల్స్ దండయాత్ర’

శ్రీకాకుళం: పోలాకి పీహెచ్సీ ఆరోగ్య విస్తరణ అధికారి డాక్టర్ రవికుమార్ ఆధ్వర్యంలో దోమలపై ఆయిల్ బాల్స్ దండయాత్ర కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ప్రత్యేకంగా రూపొందించిన వీటిని డ్రైనేజీలు, నీరు నిల్వ ప్రాంతాలు, చెరువుల్లో వేయడంతో దోమలను నివారించవచ్చునని ఆయన అన్నారు. దోమల వల్ల కలిగే డెంగీ, మలేరియా, చికెన్ గున్యా తదితర వ్యాధుల నివారణకు ఈ కార్యక్రమం నిర్వహించినట్లు పేర్కొన్నారు.