పిల్లలపై తల్లిదండ్రులు నిఘా ఉంచాలి: సీఐ

పిల్లలపై తల్లిదండ్రులు నిఘా ఉంచాలి: సీఐ

ప్రకాశం: తమ పిల్లలపై తప్పనిసరిగా తల్లిదండ్రులు నిఘా ఉంచాలని కనిగిరి సీఐ ఖాజావలి తెలియజేశారు. బుధవారం స్థానిక సిఐ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. వేసవి సెలవులు వచ్చిన నేపథ్యంలో తమ పిల్లల్ని అనవసరంగా ఎండకు తిప్పకుండా తల్లితండ్రులు జాగ్రత్త వహించాలన్నారు. ఇక మీ ప్రాంతాలలో ఉన్న చెరువులు, బావులు, కుంటలలో ఈతకు వెళ్లకుండా తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.