మాజీ మంత్రి అప్పలరాజుకు మరో నోటీసు
SKLM: మాజీ మంత్రి అప్పలరాజుకు కాశీబుగ్గ పోలీసులు ఆదివారం మరో నోటీసు ఇచ్చారు. కల్తీ మద్యంపై గత నెల 13న YCP ఆధ్వర్యంలో కాశీబుగ్గలో ర్యాలీ నిర్వహించారు. అందుకు సంబంధించి అప్పలరాజుతో పాటు మరికొందరి పై కేసు నమోదు చేయగా దీని విచారణకు సోమవారం హాజరు కావాలని తన నివాసానికి వెళ్లి ఎస్సై నరసింహమూర్తి నోటీసు అందజేశారు.