తండ్రిని నిర్లక్ష్యం చేశాడని కుమారుడిపై కేసు
PDPL: గోదావరిఖని మారుతీ నగర్‌కు చెందిన అనంతుల శంకర్ లింగం తన ఆస్తి, నగదును కుమారుడు తీసుకుని తనను నిర్లక్ష్యం చేస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు. వన్ టౌన్ సీఐ ఇంద్రసేనారెడ్డి ఆదేశాల మేరకు ఎస్సై రమేశ్ ఘటనా స్థలానికి చేరుకుని ఫిర్యాదు ఆధారంగా రెండవ భార్య భారతీ, కుమారుడు పూర్ణచందర్‌పై కేసు నమోదు చేశారు.