VIDEO: ఘనంగా గీతా జయంతి వేడుకలు
SRD: నారాయణఖేడ్ పట్టణంలోని శ్రీ భక్త మార్కండేయ చంద్రమౌళీశ్వర ఆలయంలో సోమవారం ఘనంగా గీతా జయంతి వేడుకలు జరుపుకున్నారు. ఆలయ కమిటీ నిర్వాహకులు గత కొద్దిరోజుల నుంచి గీతా పారాయణం చేపట్టారు. ఈ సందర్భంగా ముగింపు కార్యక్రమంలో చిప్ప అనంతం దంపతుల ఆధ్వర్యంలో యజ్ఞం హోమాది కార్యక్రమాలు జరిపించారు. అదేవిధంగా పాఠశాలల విద్యార్థులు భక్తి శ్రద్ధలతో గీత భజనలు చేశారు.