మంచి మార్పు మన నుంచే: సీఐ వేణు
JN: స్టేషన్ ఘనపూర్ పట్టణంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో సీఐ వేణు పాల్గొన్నారు. మంచి మార్పు మన నుంచే ప్రారంభం కావాలని పిలుపునిచ్చారు. రోడ్డు భద్రత కమిటీలు ఏర్పాటు చేశామని, వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్, డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్ కలిగి ఉండాలని సూచించారు. నేరాల నియంత్రణ కోసం గ్రామాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సర్పంచ్లను కోరారు.