VIDEO: వరంగల్–ఖమ్మం హైవేపై మంచు ముసురు.. కనిపించని రోడ్డు
WGL: వర్ధన్నపేట పట్టణంలో వరంగల్–ఖమ్మం జాతీయ రహదారిపై మంగళవారం ఉదయం ఘనమైన పొగ మంచు కమ్మేసింది. రోడ్డు సైతం కనిపించనంతగా మంచు వ్యాపించడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించక లైట్ల వెలుతురులోనే నెమ్మదిగా ప్రయాణించాల్సి వస్తోంది. మంచు కురవడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.