జిల్లాలో తగ్గుతున్న ఎయిడ్స్ మహమ్మారి!
నల్గొండ జిల్లాలోని ఆరోగ్య శాఖ, ఎయిడ్స్ నియంత్రణ శాఖ అధికారుల సమిష్టి కృషి ఫలితంగా జిల్లాలో ఎయిడ్స్ తగ్గుముఖం పట్టింది. గతంలో ఎయిడ్స్‌పై పూర్తి అవగాహన లేకపోవడంతో కేసులు విచ్చలవిడిగా పెరిగిపోయేవి. ఎయిడ్స్ వ్యాధికి మందు లేకపోవడం నివారణ ఒక్కటే మార్గ కావడంతో జిల్లా ప్రజలను ఆదిశగా చైతన్యం చేసిన అధికారులు ఏటేటా రోగుల సంఖ్యను తగ్గిస్తూ వస్తున్నారు.