తొర్రూర్‌లో విద్యార్థి పోరు గర్జన జీపు యాత్ర ప్రారంభం

MHBD: తొర్రూర్ మండల కేంద్రంలోని SFI ఆధ్వర్యంలో విద్యార్థి పోరు గర్జన జీపు యాత్రను ప్రారంభించారు. ఇందులో భాగంగా వందలాది విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం SFI రాష్ట్ర ఉపాధ్యక్షుడు కిరణ్ మాట్లాడుతూ.. పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్స్, ఫీజు రియంబర్స్ మెంట్ నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ యాత్రలో ఆయన వెంట జ్యోతి బస్స్, పట్ల మధు, తదితరులు ఉన్నారు.