జిల్లాలో రేపు మంత్రి అనగాని పర్యటన
VSP: రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖ మంత్రి అనగాని రేపు జిల్లాలో పర్యటించనున్నట్లు అధికారులు తెలిపారు. ఉదయం గన్నవరం నుంచి బయలుదేరి విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. కలెక్టరేట్‌లో చందనోత్సవ ఏర్పాట్లు సమీక్షిస్తారు. అనంతరం సింహాచల దేవస్థానంలో కళ్యాణ మండపం ప్రారంభించి సాయంత్రం తిరుగు ప్రయాణం అవుతారు.