బద్వేలులో తాగునీటి మోటారుకు మరమ్మతులు

KDP: బద్వేలు మండలం వీరప్పల్లి గ్రామంలో తాగునీటి మోటార్ మరమ్మతుకు గురి కావడంతో ప్రజలు తాగునీటికి తీవ్ర అవస్థలు ఎదుర్కొంటుండేవారు. కాగా, శనివారం పంచాయతీ కార్యదర్శి శ్రీనివాసులు తక్షణం స్పందించి తాగునీటి మోటార్‌కు మరమ్మతులు చేపట్టేలా చర్యలు తీసుకున్నారు. కాగా, సమస్య పరిష్కారం జరిగి తాగునీటికి ఇబ్బందులు తొలగడం పట్ల గ్రామ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.