మండలంలో మౌలిక వసతుల కల్పనకు చర్యలు
ASF: తిర్యాణి మండలంలో మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారి సూచించారు. జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో మండలంలోని ఆకాంక్షిత బ్లాక్లో చేపట్టవలసిన మౌలిక వసతుల పనులపై విద్య, వైద్య-ఆరోగ్య, శిశు సంక్షేమ, వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి శాఖల అధికారులతో సమీక్షించారు. అంగన్వాడీ నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలన్నారు.