'గ్యాస్ బుకింగ్ మోసాలపై అప్రమత్తంగా ఉండండి'
MDK: రామాయంపేట మండలంలో గ్యాస్ కొరత లేదని, ఆన్‌లైన్‌లో బుక్ చేసిన సిలిండర్ 45 రోజులలోపే అందుతుందని తహశీల్దార్ రజనీకుమారి తెలిపారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. గ్యాస్ బుకింగ్ పేరుతో అపరిచితుల నుంచి వస్తున్న ఫోన్ కాల్స్‌పై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గ్యాస్ సరఫరాలో ఇబ్బందులుంటే మధ్యవర్తులపై ఆధారపడకుండా అధికారులను సంప్రదించాలని ఆమె సూచించారు.