ఎర్రచందనం స్మగ్లర్లకు జైలుశిక్ష

ఎర్రచందనం స్మగ్లర్లకు జైలుశిక్ష

TPT: ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తూ పట్టుబడిన ఇద్దరికి శిక్ష విధిస్తూ ఆర్ఎస్ఎస్ ఏడీజే కోర్టు న్యాయమూర్తి నరసింహమూర్తి శుక్రవారం తీర్పు చెప్పారు. కరకంబాడీ బీటు పరిధిలో ఇద్దరు అరెస్టయ్యారు. నిందితులు తమిళనాడులోని తిరువన్నామలై జిల్లాకు చెందిన వెల్లయ్యన్ శివాజీ, మోహన్ శంకర్‌గా గుర్తించారు. వీరిపై నేరం రుజువు కావడంతో ఐదేళ్ల జైలు శిక్ష, రూ.3లక్షలు జరిమానా విధించారు.