మోదీ, విజయన్‌పై రాహుల్ విమర్శలు
కేరళంలోని ఇడుక్కి ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. PM మోదీ, CM పినరయి విజయన్ లక్ష్యంగా విమర్శలు గుప్పించారు. US అధ్యక్షుడు ట్రంప్ చెప్పినట్లు మోదీ నడుచుకుంటున్నారని, అదేవిధంగా మోదీ మాటను విజయన్ వింటున్నారని రాహుల్ ఎద్దేవా చేశారు. వీరిద్దరూ కలిసి రాష్ట్ర ప్రజలను వంచిస్తున్నారని, కేరళం అభివృద్ధిని అడ్డుకుంటున్నారని ఆయన ఆరోపించారు.