పొదిలిలో సాగర్ పైపులైన్లు ధ్వంసం
ప్రకాశం: పొదిలి సబ్ రిజిస్టర్ ఆఫీస్ వీధిలో ఇటీవల కరెంట్ స్తంభాలు ఏర్పాటు చేశారు. ఈక్రమంలో సాగర్ పైపులైన్లు దెబ్బతిన్నాయని స్థానికులు తెలిపారు. మున్సిపల్ అధికారులను ముందుగా సంప్రదించి ఉంటే పైప్ లైన్ దెబ్బతినేది కాదన్నారు. మున్సిపల్, విద్యుత్ అధికారుల మధ్య సమన్వయం లేకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడిందని.. ఇప్పటికైనా సమస్యను పరిష్కరించాలని కోరారు.