VIDEO: బాదేపల్లి మార్కెట్‌లో పంటలకు చక్కని ధరలు
MBNR: బాదేపల్లి మార్కెట్ యార్డులో మంగళవారం పెద్ద ఎత్తున పంటలు చేరాయి. ఆర్ఎన్ఆర్ రకం వడ్లు 5572 క్వింటాళ్లు వచ్చి క్వింటాల్‌కు గరిష్టంగా రూ.2829 పొందాయి. అరుదుగా వచ్చిన చిట్టి ముత్యాల వడ్లకు రూ.3016 ధర లభించింది. మొక్కజొన్న క్వింటాల్ రూ.1972కి, హంస రకం వడ్లు రూ.1866కి విక్రయమయ్యాయి.