మచిలీపట్నానికి రానున్న వెంకయ్య నాయుడు
కృష్ణా: మచిలీపట్నంలోని కృష్ణ యూనివర్సిటీలో ఈరోజు నిర్వహిస్తున్న ప్రత్యేక కార్యక్రమంలో భారత దేశ మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. విశ్వవిద్యాలయ విద్యార్థులు, అధ్యాపకులు, అధికారులు వివిధ విభాగాల ప్రతినిధులు పాల్గొనే ఈ కార్యక్రమంలో విద్య, సమాజ సేవ,యువత భవిష్యత్తు వంటి అంశాలపై వెంకయ్య నాయుడు సందేశాన్ని అందించనున్నారు.