పొగాకు విక్రయాలపై పోలీసుల కఠిన చర్యలు

పొగాకు విక్రయాలపై పోలీసుల కఠిన చర్యలు

HNK: వేలేరు, ఎర్రబెల్లి గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాలల సమీపంలో పొగాకు ఉత్పత్తులు విక్రయించిన ఆరుగురిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. నిషేధిత పొగాకు అమ్మకాలపై వేలేరు పోలీసులు కఠిన చర్యలు చేపట్టి, షాపుల్లో లభ్యమైన పొగాకు ఉత్పత్తులను సీజ్ చేశారు. పాఠశాలలకు 100 మీటర్ల పరిధిలో అమ్మకాలు జరిగితే కఠిన చర్యలు తప్పవని ఎస్సై సురేష్ హెచ్చరించారు.