దుబాయ్‌లో భారత సంతతి పారిశ్రామికవేత్త మృతి
యూఏఈ డిజిటల్ డిజైన్ రంగంలో తనదైన ముద్ర వేసిన భారత సంతతికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త దేవేశ్ మిస్త్రీ దుబాయ్‌లో మృతి చెందారు. అయితే ఆయన మరణానికి సంబంధించిన విషయాలు తెలియరాలేదు. మిస్త్రీ చేసిన యూజర్ ఫ్రెండ్లీ డిజైన్లు చాలా ప్రసిద్ధిగాంచాయి. ఆయన స్థాపించిన RBBi సంస్థ డిజిటల్ ఎక్స్‌పీరియన్స్ పరిశ్రమను తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషించింది.