IPO పేరిట మోసాలు.. జర జాగ్రత్త..!
HYD: IPO పేరుతో మోసాలు జరుగుతున్నాయి. వాటి పట్ల జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. HYD ట్రై కమిషనరేట్ల పరిధిలో సుమారుగా 13 కేసుల్లో ఐపీవో మోసాలు బయటపడ్డాయి. అత్యాశకు పోయి, డబ్బు పోగొట్టుకోవద్దని, ప్రతి విషయాన్ని ఒకటికి రెండుసార్లు శోధించి, ఒక నిర్ణయానికి రావాలని ట్రై కమిషనరేట్ పరిధిలోని పోలీసులు సూచిస్తున్నారు.