వైజాగ్లో ఏపీఎల్-4.. సీఎంకు ఆహ్వానం

VSP: సీఎం చంద్రబాబు నాయుడును ఏపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ఛైర్మన్ సుజయ్ కృష్ణ రంగారావు మంగళవారం సచివాలయంలో కలిశారు. వైజాగ్‌లోని ఏసీఏ-విడిసిఎ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఆగస్టు 8 నుంచి ఆగస్టు 23 వరకు జరగనున్న ఆంధ్ర ప్రీమియర్ లీగ్ సీజన్-4కి సీఎంను, మంత్రి లోకేశ్‌ను ఆహ్వానించారు. రాష్ట్రంలో క్రికెట్ క్రీడాకారాలను ప్రోత్సహించాలని సీఎం సూచించారు.