అన్నా క్యాంటీన్‌ను పరిశీలించిన మున్సిపల్ కమిషనర్

చిత్తూరు: జిల్లా పలమనేరులోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద గల అన్నా క్యాంటీన్‌ను మున్సిపల్ కమిషనర్ రమణారెడ్డి బుధవారం పరిశీలించారు. అన్నా క్యాంటీన్‌ను నియోజకవర్గ ప్రజలే కాకుండా తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి వచ్చే ప్రయాణికులు సైతం వినియోగించుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నారు. క్యాంటీన్ పరిసర ప్రాంతాలు స్వచ్ఛత, పరిశుభ్రతపై సంతృప్తి వ్యక్తం చేశారు.