'కామన్ డైట్ మెనూ తప్పనిసరిగా పాటించాలి'

'కామన్ డైట్ మెనూ తప్పనిసరిగా పాటించాలి'

SDPT: కామన్ డైట్ మెనూ తప్పనిసరిగా పాటించి రుచికరంగా వండాలని వంట సిబ్బందిని జిల్లా కలెక్టర్ హైమవతి ఆదేశించారు. నారాయణరావుపేట మండలం గుర్రాలగొంది గ్రామంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాల, జూనియర్ కళాశాలను ఆకస్మికంగా సందర్శించి రాత్రి భోజన ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అన్నం, దోసకాయ కూర, సాంబారు, పెరుగును పరిశీలించారు.