VIDEO: బేస్తవారిపేటలో ఘనంగా శ్రీ కృష్టాష్టమి వేడుకలు

ప్రకాశం: బేస్తవారిపేట పట్టణంలోని శ్రీ షిరిడి సాయి మందిరంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులు కోలాట ప్రదర్శనతో అందరినీ ఆకట్టుకున్నారు. జన్మాష్టమి సందర్భంగా బండలాగుడు పోటీలను నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు ప్రధానం చేస్తారన్నారు.