కాంగ్రెస్ పార్టీ ప్రలోభాలకు పాల్పడుతోంది: మాజీ మంత్రి
TG: కాంగ్రెస్‌పై మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తీవ్ర విమర్శలు చేశారు. 'మేయర్ ఎన్నికల్లో మేం హుందాగా వ్యవహరించాం. కాంగ్రెస్ పార్టీ ప్రలోభాలకు పాల్పడుతోంది. కాంగ్రెస్‌లో చేరితే పనులు, నిధులు ఇస్తామని BRS కార్పొరేటర్లపై ఒత్తిడి తెస్తున్నారు. పోలీసులు కూడా మా నేతలపై ఒత్తిడి చేస్తున్నారు. మహిళా కార్పొరేటర్ భర్తకు ఫోన్ చేసి ముడా ఛైర్మన్ ఆఫర్ చేశారు' అని ఆరోపించారు.