పశువుల తాగునీటి తోట్లను పరిశీలించిన ఎంపీడీవో

ప్రకాశం: వెలిగండ్ల మండలం నాగిరెడ్డి పల్లిలో నిర్మించిన నీటి తొట్లను బుధవారం ఎంపీడీవో మహబూబ్ బాషా పరిశీలించారు. ఎండాకాలం నేపథ్యంలో మూగజీవాలకు తాగునీటికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు ఈ నీటితోట్లు ఉపయోగపడతాయని తెలిపారు. కావున పశుపోషకులు ఈ నీటితొట్లు ఉపయోగించుకోవాలని కోరారు.