అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు ప్రభుత్వ విప్
SRCL: వేములవాడ పట్టణంలోని అయ్యప్ప స్వామి నిత్యాన్నదాన ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో ఇవాళ ఏర్పాటు అన్నదాన కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వామి వారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులతో కలసి సహపంక్తి భోజనం చేశారు. గురు స్వామి రాచర్ల శ్రీనివాస్, అయ్యప్ప భక్తులు పాల్గొన్నారు.