బీఆర్ఎస్‌లో చేరిన పలువురు కాంగ్రెస్ నేతలు
JN: పాలకుర్తి మండలం శాతపురం గ్రామానికి చెందిన పలువురు కాంగ్రెస్ నేతలు మాజీమంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆధ్వర్యంలో బుధవారం బీఆర్ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి వారికి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. పార్టీ మారిన వారిలో గన్న యాకన్న, ఐలేని కృష్ణమూర్తి, తోడేటి అనిత తదితరులున్నారు.