VIDEO: పొర్ల కట్టలను పరిశీలించిన ఎమ్మెల్యే
NLR: బుచ్చిరెడ్డిపాలెం మండలం బాపనపాడు, జొన్నవాడ పెన్నా నది పరివాహక ప్రాంతాలలో స్వల్పంగా తెగిన పొర్ల కట్టలను ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి పరిశీలించారు. పొర్లకట్ట మరమ్మతులకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని, శనివారం పనులను ప్రారంభిస్తామని ఆమె వెల్లడించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.