కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రైతు భరోసా సంబరాలు

KNR: తిమ్మాపూర్ మండలం అలుగునూర్ కూడలి వద్ద మండల కాంగ్రెస్ ఆధ్వర్యంలో రైతు భరోసా సంబరాలు నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా పథకం ద్వారా 100 శాతం రైతుల ఖాతాల్లో జమ చేసినందుకు గాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ చిత్రపటాలకు పాలభిషేకం చేశారు.