ఇజ్రాయెల్ చమురు శుద్ధి కేంద్రంపై ఇరాన్ దాడి
ఇజ్రాయెల్ హైఫా నగరంలోని చమురు శుద్ధి కేంద్రంపై ఇరాన్ భీకర దాడులు చేసింది. దీంతో చమురు ట్యాంకర్‌లో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. వెంటనే రంగంలోకి దిగిన ఇజ్రాయెల్ ఫైర్ సిబ్బంది కొన్ని గంటల పాటు శ్రమించి మంటలను అదుపు చేశారు. మరో వైపు యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు తమ దాడుల్లో 6 వేల మందికిపైగా ఇజ్రాయెల్ ప్రజలు గాయపడినట్లు ఇరాన్ ప్రకటించింది.