కువైట్‌పై ఇరాన్ దాడి.. భారతీయుడి మృతి
ఇరాన్ గల్ఫ్ దేశాలపై దాడులను ముమ్మురం చేసింది. తాజాగా కువైట్‌లోని ఒక విద్యుత్ ప్లాంట్‌పై ఇరాన్ క్షిపణి దాడి చేసింది. ఈ దాడిలో ప్లాంట్‌లోని ఒక సర్వీస్ బిల్డింగ్ దెబ్బతినగా, అక్కడ పనిచేస్తున్న ఓ భారతీయ కార్మికుడు ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడి వల్ల భారీ ఆస్తి నష్టం సంభవించిందని కువైట్ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఫాతిమా అబ్బాస్ జౌహర్ హయత్ ధృవీకరించారు.