నేడు, రేపు స్వర్ణాభరణాలతో ఆదిత్యుని దర్శనం

నేడు, రేపు స్వర్ణాభరణాలతో ఆదిత్యుని  దర్శనం

SKLM: కార్తిక శుద్ధ ఏకా దశి, ద్వాదశి పర్వదినాలను పురస్కరించుకుని అరసవల్లి క్షేత్రంలో సూర్యనారాయణ స్వామిని స్వర్ణాభరణాలతో అలంకరించనున్నారు. శని, ఆదివారాల్లో ఆదిత్యుడు స్వర్ణాభరణాలతో భక్తులకు దర్శనం ఇవ్వనున్నట్లు ఆలయ ఈవో ప్రసాద్ తెలిపారు. భక్తులకు ఇబ్బందులేకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.