పీఏబీఆర్ ప్రధాన గేటు బంద్.. విద్యుత్తు ఉత్పత్తి కొనసాగింపు

పీఏబీఆర్ ప్రధాన గేటు బంద్.. విద్యుత్తు ఉత్పత్తి కొనసాగింపు

ATP: పెన్నహోబిలం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ (పీఏబీఆర్) ప్రధాన గేటును ఐదు రోజుల తర్వాత అధికారులు బంద్ చేశారు. ప్రస్తుతం డ్యాంలోని జల విద్యుత్ కేంద్రంలో ఒక టర్బైన్‌ను వినియోగించి 885 క్యూసెక్కుల నీటితో 75 వేల యూనిట్ల కరెంటు ఉత్పత్తి చేస్తున్నారు. డ్యాంలో నీటి నిల్వ 5.214 టీఎంసీలకు చేరినట్లు ఇరిగేషన్ ఏఈఈ లక్ష్మీదేవి తెలిపారు.