'ఆటపాటలతో కూడిన విద్యను అందించండి'

అన్నమయ్య: అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలకు ఆటపాటలతో కూడిన విద్యనందించాలని ఎంపీడీవో రమేశ్ బాబు సూచించారు. ఇవాళ నిమ్మనపల్లె మండలం బండ్లపై గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు. పాఠశాలలో పిల్లల సంఖ్య, మౌలిక సౌకర్యాలు, పిల్లలకు అందుతున్న విద్య, పారిశుద్ధ్యం తదితరాలను పరిశీలించారు. తాజా కూరగాయలతో వండిన పౌష్టికాహారాన్ని పిల్లలకు అందించాలన్నారు.