వెలుగు చూడనున్న గిరిజన గ్రామాలు
పార్వతీపురం డివిజన్‌లో PM సూర్యఘర్ పథకం కింద 6,802, పాలకొండలో 7,308తో మొత్తం 14,110 సర్వీసులకు కనెక్షన్లు ఏర్పాటు చేయనున్నారు. ఈ పథకంలో SC, STలకు శాశ్వత ప్రాతిపదికన ఉచితంగా సౌర విద్యుత్ అందించేందుకు కార్యాచరణ ప్రారంభమైంది. త్వరలో పనులు ప్రారంభించి నిర్దేశిత సమయానికి 100% లక్ష్యాల పూర్తి చేసేందుకు దృష్టి సారిస్తున్నామని EPDCL SE కె.మల్లికార్జునరావు తెలిపారు.