అలా జరగకపోతే అది మా ఫెయిల్యూర్: నిర్మాత

అలా జరగకపోతే అది మా ఫెయిల్యూర్: నిర్మాత

బాలీవుడ్‌లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న 'రామాయణ'పై నిర్మాత నమిత్ మల్హోత్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రామాయణం గురించి ప్రపంచానికి చాటి చెప్పాలనే ఉద్దేశంతో ఈ మూవీని తెరకెక్కిస్తున్నట్లు తెలిపారు. భారతీయ సినీ ప్రేక్షకులే కాదు, పాశ్చాత్య దేశాల వారికి ఈ మూవీ నచ్చకపోతే తమ ఫెయిల్యూర్‌గా భావిస్తామని చెప్పారు. 'అవతార్' వంటి హాలీవుడ్ మూవీల స్థాయిలో ఇది ఉంటుందన్నారు.