VIDEO: 108 రకాల ప్రసాదాలతో వినాయకునికి పూజ

అనకాపల్లి: నర్సీపట్నం మున్సిపాలిటీ పరిధిలో వినాయక నవరాత్రి మహోత్సవాలు అత్యంత ఘనంగా కొనసాగుతున్నాయి. ఈ మేరకు బలిఘట్టం గాంధీ బొమ్మ సెంటర్లో ఏర్పాటు చేసిన వినాయకుని వద్ద సోమవారం సాయంత్రం 108 రకాల ప్రసాదంతో ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు అధిక సంఖ్యలో వచ్చి ఈ పూజల్లో పాల్గొన్నారు. అనంతరం వచ్చిన భక్తులకు కమిటీ సభ్యులు ప్రసాదాన్ని పంపిణీ చేశారు.