గంజాయి బ్యాచ్ హల్‌చల్.. కారు అద్దాలు ధ్వంసం

గంజాయి బ్యాచ్ హల్‌చల్.. కారు అద్దాలు ధ్వంసం

RR: రాజేంద్రనగర్ PS పరిధిలోని ఎర్రబోడలో గంజాయి బ్యాచ్ హల్‌చల్ చేసింది. ఈరోజు తెల్లవారుజాము మద్యం తాగిన పలువురు, ఒక కారు అద్దాలు ధ్వంసం చేశారు. ప్రశ్నించిన యజమానితో దురుసుగా మాట్లాడి, కారు మొత్తం ధ్వంసం చేస్తామని బెదిరింపులకు పాల్పడ్డారని స్థానికులు తెలిపారు. పోలీసులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.