సంక్షోభం వేళ.. శ్రీలంకకు భారత్ సాయం

సంక్షోభం వేళ.. శ్రీలంకకు భారత్ సాయం

ఇరాన్ యుద్ధం కారణంగా చమురు కొరతతో ఇబ్బంది పడుతున్న శ్రీలంకను భారత్ ఆదుకుంది. అత్యవసర సాయం కింద 38,000 మెట్రిక్ టన్నుల పెట్రోల్, డీజిల్‌ను లంకకు సరఫరా చేసింది. ఈ విషయాన్ని కొలంబోలోని భారత్ హైకమిషనర్ వెల్లడించారు. ఇంధన సహాయం కోసం ప్రధాని మోదీతో శ్రీలంక అధ్యక్షుడు ఇటీవల మాట్లాడారు. ఈ క్రమంలోనే భారత్ సహాయం అందించింది. ఈ సందర్భంగా ఇండియాకు శ్రీలంక ధన్యవాదాలు తెలిపింది.