అందుబాటులోకి ఆధార్ కేంద్రం

అందుబాటులోకి ఆధార్ కేంద్రం

అన్నమయ్య: రైల్వే కోడూరు పట్టణంలోని MPDO కార్యాలయ ప్రాంగణంలో నూతనంగా ఆధార్ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు MPDO నాగిరెడ్డి తెలిపారు. గురువారం ఆ కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ప్రజల సౌకర్యార్థం గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశామని, అందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.