బాలికల ఆశ్రమ పాఠశాలలను సందర్శించిన కలెక్టర్

బాలికల ఆశ్రమ పాఠశాలలను సందర్శించిన కలెక్టర్

ASF: జైనూర్ మండలం రాసిమెట్ట బాలికల ఆశ్రమ పాఠశాలలను జిల్లా కలెక్టర్ హరిత శుక్రవారం ఆకస్మికంగా సందర్శించారు. పాఠశాల తరగతి గదులు, కిచెన్ షెడ్, మరుగుదొడ్లు పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడి వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రోజువారీగా అందుతున్న టిఫిన్, భోజనం నాణ్యతపై ఆరా తీశారు. మెనూ ప్రకారం ఆహారం అందించాలని ఆదేశించారు.