'చైత్రమాసం నీలకంఠేశ్వర స్వామి ప్రత్యేక దర్శనం'
SKLM: పాతపట్నం మహేంద్ర తనయ నది పక్కన చరిత్ర కలిగిన శ్రీ నీలకంఠేశ్వర స్వామి చైత్రమాసం దశమి సందర్భంగా ఆదివారం ప్రత్యేక అలంకరణతో భక్తులకు దర్శనం ఇచ్చారు. స్వామి వారిని పూలతో ప్రత్యేక ఆకర్షణీయంగా అలంకరించారు. భక్తులు తెల్లవారుజాము నుంచే అధిక సంఖ్యలో స్వామి వారిని దర్శించుకొని తమ మొక్కులు చెల్లించుకున్నారు.